ఇ ఈ ఎ ఏలం గూడిన చజలు తాలవ్యంబులు (8)
చిలుక, చీమ, చెవి, చెలి, చేమ, జిల, జీడి, జెఱ్ఱి, జేజె
చ జ గుణింతాలతో ఉన్న మాటల్లో అ చ జ లకు ఇ,ఈ లేదా ఎ,ఏ గుణింతం ఉంటే ఆ చ జ లు తాలవ్యాలే కాని దంతవ్యాలు (ౘ, ౙ) కావు అన్నది భావం. చిన్నయసూరిగారు చ వర్ణానికి ఇక్కడ ఉదాహరణలుగా చి- చిలుక, చీ- చీమ, చె - చెవి, చే- చేమ అన్న మాటలు చూపారు. అలాగే జ వర్ణానికి ఉదాహరణలుగా జి- జిల, జీ- జీడి, జె- జెఱ్ఱి, జే- జేజె అన్నవి ఇచ్చారు.

అ ఆ ఉ ఊ ఒ ఓ ఔలం గూడిన చజలు దంతవ్యంబులు (9)
ౘలి, ౘాప, ౘుక్క, ౘొక్కు, ౘోటు, ౘౌక, ౙముడు, ౙాతర, ౙున్ను, ౙూలు, ౙొన్న, ౙోలి, ౙౌకు.
ఐదంతంబులయిన చజలు సమేతరశబ్దంబులందు లేవు.
ఐదంతంబులయిన చజలు సమేతరశబ్దంబులందు లేవు.
అచ్చుల్లో కొన్నింటి ఆధారంగా చ జలకు తాలవ్యతను చూసాంకదా 8వ /సూత్రంలో, ఇప్పుడు మిగిలిన అచ్చుల గురించి చెబుతున్నారు. అ, ఆ, ఉ, ఊ, ఒ, ఓ, ఔలతో కనక చ జల గుణింతం వచ్చిన మాటలు దంత్యాలు అన్నారు. ఈ సూత్రం పై 8వ సూత్రానికి కొనసాగింపు. కాని ముఖ్యమైన బేధమూ ఉంది. ఈ సూత్రం అచ్చతెలుగు మాటలకే వర్తిస్తుంది కాని సం స్కృతసమమైన పదాలకూ ఈ సూత్రం వర్తించదు.
ఇక్కడ కూడా దంత్యాలైన ౘకార, ౙకారలకు కొన్ని ఉదాహరణలను సూరిగారు చూపించారు.
అచ్చులన్నీ చెప్పారు కానీ , మరి ఐ గుణింతాల సంగతి యేమీటీ అంటే ఐకారంతో కూడుకున్న మాటలు తెలుగులో లేవు అనేసారు.
మీరు చైత్రము లేదా అనవచ్చును. లేదు లేదు. చైత్రము అనేది చైత్రః అన్న సంస్కృతపదానికి తెలుగు.
అలాగే జైత్రయాత్ర జైనమతము వంటి వన్నీ కూడా సంస్కృతపదాలకు తెలుగుమాటలే.
కాబట్టి ఎక్కడన్నా మనకి చై అన్న వర్ణం కనిపించితే అది సంస్కృతపదమే అన్నది బండగుర్తుగా పెటుకోవచ్చును.
అర్చి అర్ౘులు, రోచి, రోౘులు, వీచి, వీౘులు, రాజి, రాౙులు, వాజి, వాౙులు
మఱియు రాజు శబ్దంబొక్కటి దంత్యయుక్తంబు కానంబడియెడి.
ఇతరములయిన చజల కుదాహరణంబులు. చంద్రుఁడు, చుక్రిక, చూర్ణము, చోరుడు, చౌర్యము, జయము, జాతి, జుగుప్స, జూటము ఇత్యాదులు.
ఈ సూత్రంలో కొన్ని ముఖ్యమైన విశేషాలున్నాయి.
మొదటగా గమనించవలసింది, ఈ సూత్రం సంస్కృతసమములైన మాటలకు వర్తించేది. అచ్చతెలుగు మాటలకు కాదు.
రెండవది ఉపధ అన్న పారిభాషిక పదం. ఉపధ అంటే పదంలో ఆఖరు వర్ణానికు ముందు వచ్చే వర్ణం.
అర్చి అన్నది సంస్కృతం నుండి తెలుగులోనికి వచ్చిన పదం. ఈ పదంలో చిట్టచివరి వర్ణం ఇకారం. ఎందుకంటే ఇందులో వర్ణాల క్రమం అ + ర్ + చ్ + ఇ అన్నది. ఇక్కడ చివరి వర్ణం ఇ అయింది. అలాగే దానికి ముందున్న వర్ణం చ. ( అసలు వర్ణం చ్ అనే కాని పలకటంలో సులువు కోసం అకారం చేర్చి పలుకుతారు చ్ + అ => చ అని, అది సమ్మతమే). ఇలా ఈ సూత్రంలో ఉన్న రెండు షరతులూ సరిపోయాయి.
అర్చి అన్నప్పుడు ఏకవచనమే, అందులో వచ్చే మార్పు ఏమీ ఈ సూత్రం చెప్పటం లేదు.
ఇప్పుడు ఈ అర్చి కి బహువచనం ఐన పదం తెలుగులో అర్చి + లు కదా,
ఇప్పుడు ఈ అర్చిలో ఉన్న వర్ణాల్లో మార్పు వస్తుంది
అ + ర్ + చ్ + ఇ + లు అన్నది అ + ర్ + ౘ్ + ఇ + లు అని మారి పోతుంది ఈ సూత్రం ప్రకారం.
ముందుముందు రాబోయే వేరే సూత్రాన్ని అనుసరించి, ఈ పదంలోని ఇ కాస్తా ఉ గా మారుతుంది. అంటే,
అ + ర్ + ౘ్ + ఇ + లు అన్నది అ + ర్ + ౘ్ + ఉ + లు గా మారుతుంది.
ఇప్పుడు వర్ణాలను పదంగా కలిపి రాస్తే అర్ౘులు అవుతుంది.
ఇలా సూరిగారు ఇచ్చిన పట్టికలోని పదాలన్నింటికీ సాధన చేయవచ్చును ఈ సూత్రంతో.
ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే ఈ పదాలు తప్ప సంస్కృతంలో దంత్య చజలు (ౘ,ౙ) లేవు!
సూరిగారు జొ, జోలతో కూడిన సంస్కృతపదాలను ఉదాహరణల్లో ఇవ్వలేదు. వీటికి సంస్కృతంలో ప్రసిధ్ధపదాలు లేకపోవటమే కారణం.
ఇక్కడ కూడా దంత్యాలైన ౘకార, ౙకారలకు కొన్ని ఉదాహరణలను సూరిగారు చూపించారు.
అచ్చులన్నీ చెప్పారు కానీ , మరి ఐ గుణింతాల సంగతి యేమీటీ అంటే ఐకారంతో కూడుకున్న మాటలు తెలుగులో లేవు అనేసారు.
మీరు చైత్రము లేదా అనవచ్చును. లేదు లేదు. చైత్రము అనేది చైత్రః అన్న సంస్కృతపదానికి తెలుగు.
అలాగే జైత్రయాత్ర జైనమతము వంటి వన్నీ కూడా సంస్కృతపదాలకు తెలుగుమాటలే.
కాబట్టి ఎక్కడన్నా మనకి చై అన్న వర్ణం కనిపించితే అది సంస్కృతపదమే అన్నది బండగుర్తుగా పెటుకోవచ్చును.
సంస్కృత సమంబులం దికారాంతంబులయిన శబ్దంబుల యుపధా చజలు బహువచనంబు పరంబగునపుడు దంత్యంబులగును (10)
ఇవి దప్ప సంస్కృతసమంబులందు దంత్యచజలు లేవని తాత్పర్యము.అర్చి అర్ౘులు, రోచి, రోౘులు, వీచి, వీౘులు, రాజి, రాౙులు, వాజి, వాౙులు
మఱియు రాజు శబ్దంబొక్కటి దంత్యయుక్తంబు కానంబడియెడి.
ఇతరములయిన చజల కుదాహరణంబులు. చంద్రుఁడు, చుక్రిక, చూర్ణము, చోరుడు, చౌర్యము, జయము, జాతి, జుగుప్స, జూటము ఇత్యాదులు.
ఈ సూత్రంలో కొన్ని ముఖ్యమైన విశేషాలున్నాయి.
మొదటగా గమనించవలసింది, ఈ సూత్రం సంస్కృతసమములైన మాటలకు వర్తించేది. అచ్చతెలుగు మాటలకు కాదు.
రెండవది ఉపధ అన్న పారిభాషిక పదం. ఉపధ అంటే పదంలో ఆఖరు వర్ణానికు ముందు వచ్చే వర్ణం.
అర్చి అన్నది సంస్కృతం నుండి తెలుగులోనికి వచ్చిన పదం. ఈ పదంలో చిట్టచివరి వర్ణం ఇకారం. ఎందుకంటే ఇందులో వర్ణాల క్రమం అ + ర్ + చ్ + ఇ అన్నది. ఇక్కడ చివరి వర్ణం ఇ అయింది. అలాగే దానికి ముందున్న వర్ణం చ. ( అసలు వర్ణం చ్ అనే కాని పలకటంలో సులువు కోసం అకారం చేర్చి పలుకుతారు చ్ + అ => చ అని, అది సమ్మతమే). ఇలా ఈ సూత్రంలో ఉన్న రెండు షరతులూ సరిపోయాయి.
అర్చి అన్నప్పుడు ఏకవచనమే, అందులో వచ్చే మార్పు ఏమీ ఈ సూత్రం చెప్పటం లేదు.
ఇప్పుడు ఈ అర్చి కి బహువచనం ఐన పదం తెలుగులో అర్చి + లు కదా,
ఇప్పుడు ఈ అర్చిలో ఉన్న వర్ణాల్లో మార్పు వస్తుంది
అ + ర్ + చ్ + ఇ + లు అన్నది అ + ర్ + ౘ్ + ఇ + లు అని మారి పోతుంది ఈ సూత్రం ప్రకారం.
ముందుముందు రాబోయే వేరే సూత్రాన్ని అనుసరించి, ఈ పదంలోని ఇ కాస్తా ఉ గా మారుతుంది. అంటే,
అ + ర్ + ౘ్ + ఇ + లు అన్నది అ + ర్ + ౘ్ + ఉ + లు గా మారుతుంది.
ఇప్పుడు వర్ణాలను పదంగా కలిపి రాస్తే అర్ౘులు అవుతుంది.
ఇలా సూరిగారు ఇచ్చిన పట్టికలోని పదాలన్నింటికీ సాధన చేయవచ్చును ఈ సూత్రంతో.
- అర్చి + లు => అర్ౘులు
- రోచి + లు => రోౘులు
- వీచి + లు => వీౘులు
- రాజి + లు => రాౙులు
- వాజి + లు => వాౙులు
ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే ఈ పదాలు తప్ప సంస్కృతంలో దంత్య చజలు (ౘ,ౙ) లేవు!
సూరిగారు జొ, జోలతో కూడిన సంస్కృతపదాలను ఉదాహరణల్లో ఇవ్వలేదు. వీటికి సంస్కృతంలో ప్రసిధ్ధపదాలు లేకపోవటమే కారణం.
మిగతావాటి మాట యెలా ఉన్నా
రిప్లయితొలగించండిఏ భాషలోనైనా
ఉత్వ విషిష్టమైన చ కారం దంతవ్వం గానే పలుకబడుతూ ఉంది .
నిజమే. కస్తూరీ తిలకం పద్యంలో చివరన గోపాలచూడామణిః అని వస్తుంది తెలుగువాళ్ళం చూడామణిలో చూ ను దంత్యంగానే పలుకుతాం. కాని సంస్కృతంలో అది తాలవ్యమే, ఎందుకంటే ఆ భాషలో చజలకు దంత్యాలు లేవు కదా!.
తొలగించండిఇది ఎ పద్యం.. ఉత్పల మాల, చంపక మాల.. ఇంకేదైనా చెప్పండి
రిప్లయితొలగించండి