చిన్నయసూరిగారి బాలవ్యాకరణం సంజ్ఞా పరిఛ్ఛేదం సూత్రం - 1
గమనిక. సంజ్ఞాపరిఛ్ఛేదం అంటే సాంకేతిక విషయాలకు సంబంధించిన విభాగం (chapter) అని అర్థం. అన్ని శాస్త్రాల్లాగే వ్యాకరణశాస్త్రానికీ దాని సంబంధించిన పరిభాష (terminology) ఉంది.
వీటిని ఇలా బొమ్మల్లో చూదాం.
పైన మూడు పట్టికలు కనిపిస్తున్నాయి కదా.
1. అ ఇ ఉ ణ్
2. ఋ ఌ క్
3. ఏ ఓ ఙ్
4. ఐ ఔ చ్
5. హ య వ ర ట్
6. ల ణ్
7. ఞ మ ఙ ణ న మ్
8. ఝ భ ఞ్
9. ఘ ఢ ధ ష్
10. జ బ గ డ ద శ్
11. ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్
12. క ప య్
13. శ ష స ర్
14. హ ల్
ఈ సూత్రాల్లో మొదటిదైన అ ఇ ఉ ణ్ నుండి ఐ ఔ చ్ వరకూ గలవి అచ్చులు. వీటిలో మొదటి సూత్రం అ తో ప్రారంభం అవుతుంది. నాలుగవ సూత్రం చ్ అనే దానితో పూర్తవుతుంది. ఈ ఆధ్యంతాలను కలిపితే అచ్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్న వర్ణాలకు అందుకే అచ్చులు అని పేరు.
అలాగే ఐదవసూత్రం హ య వ ర ట్ అని మొదలౌతుంది కదా. ఆఖరు సూత్రం హల్ అని ముగుస్తుంది. ఈ మొదటి హకారం నుండి తుది ల్ వరకు ఉన్నవన్నీ హల్లులు అయ్యాయి.
వర్ణమాలలో పైన హల్లుల్ని అకారాంతగా చూపించింది కేవలం ఉఛ్ఛారణాసౌలభ్యానికే. సిధ్ధాంతకౌముది లో హకారదిషు అకారః ఉఛ్ఛారణార్థః అని చెప్పారు.
ఇక్కడ హల్లుల్లోని ళకారం, హేళనలో ఉన్న ళ వలె మూర్ధన్య ళకారం.
గమనిక. సంజ్ఞాపరిఛ్ఛేదం అంటే సాంకేతిక విషయాలకు సంబంధించిన విభాగం (chapter) అని అర్థం. అన్ని శాస్త్రాల్లాగే వ్యాకరణశాస్త్రానికీ దాని సంబంధించిన పరిభాష (terminology) ఉంది.
సంస్కృతమునకు వర్ణంబు లేఁబది
సంస్కృతభాషలో ఉన్న అక్షరాల సంఖ్య 50.
వీటిని ఇలా బొమ్మల్లో చూదాం.
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ |
ఌ | ౡ | ఏ | ఐ | ఓ | ఔ | అం | అః |
క | ఖ | గ | ఘ | ఙ |
చ | ఛ | జ | ఝ | ఞ |
ట | ఠ | డ | ఢ | ణ |
త | థ | ద | ధ | న |
ప | ఫ | బ | భ | మ |
య | ర | ల | వ | శ | ష | స | హ | ళ |
పైన మూడు పట్టికలు కనిపిస్తున్నాయి కదా.
అచ్చులు
అన్నింటి కన్నా పై పట్టికలో అ నుండి అః వరకూ ఉన్న 16 వర్ణాలనూ అచ్చులు అంటారు.హల్లులు
మిగిలిన రెండు పట్టికల్లో ఉన్న క నుండి ళ వరకూ ఉన్న 34 వర్ణాలనూ హల్లులు అంటారు.అసలు సంస్కృతం అన్న పేరు ఆ భాషకు ఎలా వచ్చింది?
సంస్కృతం అన్న మాటకి అర్థం సంస్కరించబడినది అని. ఏమిటయ్యా ఇక్కడ సంస్కరించబడింది అంటే అప్పటిలో వ్యవహారంలో ఉన్న భాష. భాషాప్రదీపం అనే పుస్తకంలో పాణినీయాది సంస్కృతా సంస్కృతా భవేత్ అని ఉంది. ఈముక్కకి అర్థం ఏమిటీ అంటే పాణిని మొదలైన ఋషుల చేత సంస్కారం చేసి తీర్చిదిద్దబడిన భాషే సంస్కృతం అయ్యింది అని.అచ్చులు హల్లులు అన్న పేర్లు ఎలా వచ్చాయి?
పాణిని ఒక మహర్షి. అయనను గురించి వికీపీడియాలో చూడండి ఆసక్తి కలవారు. ఈ పాణిని మహర్షికి వ్యాకరణం సాక్షాత్తూపరమశివుడే గురువుగా బోధించాడట, ఆయనకు ఒకరిని దగ్గర కూర్చో బెట్టుకుని బోధచేసే తీరిక ఉండదు కదా మరి. అందుకని అబ్బాయీ ఇదిగో ఢమరుకం మ్రోగిస్తున్నాను. ఈ శబ్దాలనుండి సూత్రాలు గ్రహించు అని అనుగ్రహించాడట శివుడు. అవి మొత్త 14 సూత్రాలు. వాటిని మాహేశ్వర సూత్రాలంటారు. అవి ఇవిగో1. అ ఇ ఉ ణ్
2. ఋ ఌ క్
3. ఏ ఓ ఙ్
4. ఐ ఔ చ్
5. హ య వ ర ట్
6. ల ణ్
7. ఞ మ ఙ ణ న మ్
8. ఝ భ ఞ్
9. ఘ ఢ ధ ష్
10. జ బ గ డ ద శ్
11. ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్
12. క ప య్
13. శ ష స ర్
14. హ ల్
ఈ సూత్రాల్లో మొదటిదైన అ ఇ ఉ ణ్ నుండి ఐ ఔ చ్ వరకూ గలవి అచ్చులు. వీటిలో మొదటి సూత్రం అ తో ప్రారంభం అవుతుంది. నాలుగవ సూత్రం చ్ అనే దానితో పూర్తవుతుంది. ఈ ఆధ్యంతాలను కలిపితే అచ్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్న వర్ణాలకు అందుకే అచ్చులు అని పేరు.
అలాగే ఐదవసూత్రం హ య వ ర ట్ అని మొదలౌతుంది కదా. ఆఖరు సూత్రం హల్ అని ముగుస్తుంది. ఈ మొదటి హకారం నుండి తుది ల్ వరకు ఉన్నవన్నీ హల్లులు అయ్యాయి.
వర్ణమాలలో పైన హల్లుల్ని అకారాంతగా చూపించింది కేవలం ఉఛ్ఛారణాసౌలభ్యానికే. సిధ్ధాంతకౌముది లో హకారదిషు అకారః ఉఛ్ఛారణార్థః అని చెప్పారు.
ఇక్కడ హల్లుల్లోని ళకారం, హేళనలో ఉన్న ళ వలె మూర్ధన్య ళకారం.
రిప్లయితొలగించండిశ్యామలీయం వారి మరో బ్లాగన్న మాట ఇది ! శుభం మంచి ప్రయత్నం
క్ష సంసృతం లో లేదంటా రేమి టండీ ?? చక్షో సూర్యో అజాయత అంటుంది పురష సూక్తం ?? ఇందులో క్ష క్ష కాదా ??
జిలేబి
క్ష సంసృతం లో లేదనటం లేదండి. క్ష అనేది సంస్కృత వర్ణమాలలో లేదు అంటోంది వ్యాకరణం. మరింత వివరణ రాబోయే టపాలలో ఉండబోతోందండి.
తొలగించండిశుభం భూయాత్
రిప్లయితొలగించండిధన్యవదాలండీ.
తొలగించండికొందలరావుగారు నాకు ఇ-మెయిల్లో పంపిన ప్రశ్న. సంస్కృత అక్షరాలు తెలుగు అక్షరాలలాగానే ఉన్నాయేమిటి?
రిప్లయితొలగించండిమనం వ్యాకరణం చెప్పుకుంటున్నాం ఇక్కడ. అంతా తెలుగులిపిలోనే వ్రాసుకుంటున్నాం. ప్రస్తుతం సంస్కతాన్ని ఎక్కువగా నాగరి లిపిలో వ్రాస్తున్నారు. సంస్కృతంలో ఉన్న ప్రతివర్ణానికి నాగరిలిపిలో ఒక స్వరూపముద్ర ఉంది. కాబట్టి అన్ని సంస్కృతవర్ణాలనూ నాగరిలిపిలో చక్కగా వ్రాయగలం. అదే సౌలభ్యం తెలుగుకూ ఉంది. కాబట్టి అన్ని సంస్కృతవర్ణాలనూ తెలుగులిపిలోనూ చక్కగా వ్రాయగలం.
నిజానికి సంస్కృతాన్ని నాగరిలిపిలోనే వ్రాసితీరాలన్న నిర్బంధం ఏమీ లేదు. తెలుగుకు ఒక స్వంత లిపి ఉన్నట్లుగా సంస్కృతానికి ప్రస్తుతం లేదు. సంస్కృతవర్ణాలను వ్రాయటానికి వీలున్న దేశభాషా లిపులన్నింటిలోనూ సంస్కృత గ్రంథాలు ముద్రిస్తున్నారు. ఉదాహరణకు వావిళ్ళవారు అనేక గ్రంథాలను అలా ముద్రించారు. భగవద్గీత మనకి తెలుగులిపిలో దొరుకుతోంది కదా, భాష సంస్కృతమే ఐనా?
అందుచేత ఇక్కడ నేను సూచించినవి సంస్కృత భాష వర్ణాలు. అవి సూచించటానికి వాడినది తెలుగులిపి. ఇబ్బంది ఏమీ లేదు. నిజానికి ఇదే మనకి సులభం.
శ్యామలీయంగారు,
తొలగించండికొండలరావు గారు ప్రశ్న బ్లాగు పూర్వకంగా అడగాలనుకుంటే ఇక్కడే అడిగి వుండే వారు. అలా కాక మెయిలు పంపారంటే ఇక్కడ అడగడానికి మొహమాట పడి వుండ వచ్చును. ఒకవేళ వారు "బ్లాగు పూర్వకంగా సమాధానం చెప్పండి" అనకపోతే సమాధానం మెయిలుకి రిప్లైగా ఇవ్వడం సంస్కారవంతంగా వుంటుంది. గమనించ గలరని మనవి.
శ్రీకాంత్ చారిగారు,
తొలగించండిమంచి పాయింట్ పట్టారు. అభినందనలు.
కొండలరావుగారికీ నాకూ మధ్యన అనేకవిషయాల గురించి ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తూ ఉంటాయి. వారి ఒక లేఖలో ఈ విషయమే కాక అనేక విషయాలనూ ప్తస్తావించారు. ఈ ప్రశ్న గురించి వారే తమలేఖలో "నాకిప్పుడే తెలియడం లేదా చూడడం. దానిని మళ్లీ చదవాలసి ఉన్నందున కామెంట్ చేయలేదు." అన్నారు.
వారికి నన్ను ప్రశ్నించటానికి ముఖమాట పడటం అవసరం లేదు. నా భావాలు నచ్చకపోతే ఆయన నిర్మొగమాటంగా చెప్పిన సందర్భాలు తగినన్ని ఉన్నాయి. ఒక సందర్భం ఈ బ్లాగులోనే కనబడుతుంది.
కొండలరావుగారి యీ ప్రశ్నకు టపాలో సమాధానం లేదు కాబట్టి మరొకసారి చదివిన పిమ్మట కూడా సందేహనివృత్తి కలగదు. అప్పుడైనా వారికి యీ ప్రశ్నను అడిగే పరిస్థితి ఉండేదే.
అదీకాక, యీ ప్రశ్న అనేక మంది మనస్సులలో కలిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడే జవాబు ఇచ్చాను.
వారికి సమాధానం ముందుగా నేరుగా వ్రాయటమే సరైన పధ్దతి. కాని ఇందులో వ్యక్తిగతం అనేది ఎటువైపునుండి కూదా లేదు కాబట్టి, ఈ సందర్భంలో యెమీ ఇబ్బంది లేదంతే.
ఇవన్నీ కేవలం వివరణలే కాని, మీరు చెప్పింది చాలా సబబుగానే ఉంది.
శ్రీకాంత్ చారి గారి అభిప్రాయం సరయినదే. అయితే శ్యామలీయంగారన్నట్లు ఆయనను అడగడానికి నాకు ఇబ్బందేమీ లేదు. నాకీ పోస్టు సరిగా అర్ధం కానందున ఈ పోస్టులో ఎందుకు గందరగోళంగా అని మెయిల్ చేశాను. ఇందులో వ్యక్తిగతం ఏమీ లేనందున ఇక్కడ వివరణ ఇచ్చినందుకు ఇబ్బంది ఏమీ లేదు. శ్యామలీయంగారిపై గౌరవం ఉన్నట్లే ఆయన అభిప్రాయాలపై నాకు విభేధాలూ చాలా ఉన్నాయి. తెలుగు వ్యాకరణం వ్యావహారికంలో వ్రాస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశ్తిస్తున్నాను.
తొలగించండికొండలరావుగారు,
తొలగించండిమీ రిక్కడ, "నాకీ పోస్టు సరిగా అర్ధం కానందున" అన్నారు. ఇది నాకు అలోచనీయమైన విషయం. దయచేసి ఒకసారి నాకు మీకు ఈటపాను అర్థం చేసుకోవటంలో కలిగిన ఇబ్బందిని గురించి వివరించగలరా? ఎందుకంటే, సులభంగా అర్థంచేసుకోవటానికి ఏవిధమైన అడ్డంకులు ఉన్నాయో, వాటిని ఎంతవరకూ ఎలా పరిష్కరించుకుంటూ మరింత సులభంగా వ్రాయగలనో అన్నది పరిశీలించవలసి ఉందని నా అభిప్రాయం. మరొక సంగతి ఏమిటంటే ఇతరులకూ ఏమైనా అర్థంచేసుకోవటంలో ఇబ్బందులున్నాయేమో ప్రస్తుతానికి తెలియదు.
వాస్తవానికి చూస్తే అసలు సంస్కృత ,ప్రాక్రిత్ భాషలకు లిపి అనేదే లేదు ,ఈ రెండు భాషలు బ్రాహ్మణ భాషలు ,వీరు భారతదేశంలోకి వచ్చిన తరువాత ఉత్తరాది ప్రాంతాల్లో నివశిస్తున్న వారు హిందీ అక్షరాలను ,దక్షిణాది రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు తెలుగు అక్షరాలను వాడుకుని రచనలు చెయ్యడం మొదలు పెట్టారు ,,ఆవిధంగా సంస్కృతభాష లోకానికి పరిచయమైంది ,,
తొలగించండిసార్ సంసృతం నికి అర్థాలు లిపి లేవా సంసృత భాష ఎలా నేరుచుకోవలి చెప్పండి ప్లీజ్
తొలగించండితెలుగు భాష పునచ్చరణ మరియు సందేహ నివృత్తి చేసుకునే మహదవకాశం కలిగిస్తున్నందుకు ధన్యవాదాలు. మా లబ్ధి కోసం మీ ఈ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండినా ఆశ కూడా అదేనండి. కాని వృత్తిజీవితంలోని ఇబ్బందులు సమయాభావం సృష్టిస్తాయి తరచూ. (అలా అంటే కొందరు నేనేదో బిల్డప్ ఇస్తున్నానని అక్షేపిస్తున్నారు కాని సరిగా అర్థంచేసుకోవటం లేదు.). నా శాయశక్తులా ప్రయతిస్తాను.
తొలగించండిమాస్టారుగారూ నాక్కొన్ని అనుమానాలున్నాయండీ.
రిప్లయితొలగించండిమాహేశ్వరసూత్రాల్లో ళ, క్షలు లేవుకదా. ఇవి సంస్కృతంలోకెలావచ్చాయి.
అలానే ఈ సూత్రాల్లో హ రెండుసార్లు వచ్చింది. అంటే రెండు వేరువేరు "హ" లు ఉన్నాయా.
హల్ అంటే హల్లుల మొదటి హయవరట్...ల్ లను లెక్కించాలా...చివరి హల్ కూడా హల్ అవుతుందికదా. దీని ప్రయోజనం ఏమిటి.
మరోలా అనుకోకండా దయచేసి నా అనుమానం తీర్చండి మాస్టారూ!
నాకు సంస్కృతవ్యాకరణం పైన ఏమాత్రమూ పట్టులేదు! అసలు నేను సంస్కృతాన్ని అభ్యసించలేదు కదా. ఈ విషయంలో సమాధానం కొఱకు అన్వేషించి చెబుతాను.
తొలగించండిఒక చిన్న విన్నపం,,మూర్ధన్య పదాలు అంటే ఏమిటి?
రిప్లయితొలగించండిఅయ్యా!సంస్కృత ప్రతీ అక్షరానికి అర్థం ఉంటుందని విన్నాను. వాటిని తెలియపరచాలని నా ప్రార్ధన.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఆర్యా..నమస్తే..ఏకాక్షర నిఘంటువు లో వాటిని
తొలగించండితెలుసుకొనవచ్చును.
ణ తో సంస్క్రతి పదాలు
రిప్లయితొలగించండిLucky Club: Play Blackjack online with Slots.lv - LuckyClub.live
రిప్లయితొలగించండిBlackjack online is the most popular card game. You can enjoy the gameplay of the luckyclub game at one of our casinos, Lucky Club.
💐🙏
రిప్లయితొలగించండి