[ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం. సంజ్ఞాపరిఛ్ఛేదం. సూత్రం - 4 ]
ఋ ౠ ఌ ౡ విసర్గ ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ ఙ ఞ శ ష లు సంస్కృత సమంబులను గూడి తెలుగుఁన వ్యవహరింపంబడు
సంస్కృతంలోని ఋ ౠ ఌ ౡ అనే అచ్చులూ, విసర్గ, ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ అనే మహాప్రాణాలు అనే హల్లులూ, శ ష అనే ఊష్మాలూ తెలుగులో సంస్కృతపదాల వ్యవహారం ఏర్పడటం కారణంగా అదనంగా వచ్చిచేరాయి. ఇలా తెలుగులోనికి సంస్కృతం నుండి వచ్చి చేరిన వర్ణాల సంఖ్య 19
సూరిగారు ఉదాహరణలు కూడా ఇచ్చారు తెలుగులో సంస్కృతపదాల వాడుగ గురించి
ఋతువు, పి తృఆణము, కౢప్తము, ౡకారము, దుఃఖము, ఘటము, ఛత్రము, ఝురము, కంఠము, ఢక్క, రథము, ధరణి, ఫణము, భయము, పఙ్క్తి, ఆజ్ఞ, శరము, షండము
సంస్కృతంలో ఉన్న ఋతుః అన్న శబ్దమే తెలుగులో ఋతువు అయ్యింది.
సంస్కృతంలో ఉన్న దుఃఖః అన్నది దుఃఖము అయ్యింది తెలుగులో.
కౢప్తః అనే సంస్కృత శబ్దం కౢప్తము అయ్యింది.
సంస్కృతంలోని ధరణీ శబ్దం తెలుగులో ధరణి అయ్యింది.
ఆజ్ఞ అన్నది యథాతధంగా తెలుగులోనికి వచ్చేసింది.
పఙ్క్తి అన్నది తెలుగులో సాధారణంగా పంక్తి అని వ్రాస్తాము పూర్ణానుస్వారంతో.
ౡ అనే ఏకాక్షరశబ్దం సంస్కృతంలో ఉంది కాని తెలుగులో లేదు. ఐటె దీనిని తెలుగు వర్ణమాలలో ఎందుకు చేర్చుకున్నట్లు అన్న ప్రశ్న వస్తుంది తప్పకుండా. ఈ ౡకారము సంసృత వ్యాకరణంలో ఉంది. ప్రాకృత వ్యాకరణం లోనూఉంది. ఈ వర్ణం కేవలం మంత్రశాస్త్రంలో తప్ప ప్రయోగంలో లేదు. అక్కడ అవసరం కాబట్టి సంస్కృతవర్ణమాలలో ఉంది. కవులు కావ్యారంభంలో మాతృకాపూజచేయటానికి ఈశాన్యమూలను వ్రాయవలసిన అచ్చుల సమామ్నయంలో ఈ వర్ణమూ ఉంది కాబట్టి దీనికి సంస్కృతంలో ఉన్నట్లే తెలుగులో కూడా ఒక అక్షరరూపం ఇవ్వవలసి వచ్చింది. అంతకంటే ఈ వర్ణానికి విశేషప్రయోజనం ఏమీ లేదు.
ఈ 19 సంస్కృతవర్ణాలతో కూడిన మాటలు తెలుగులో వ్యవహారంలో చాలా హెచ్చుగానే ఉన్నాయి. ఇవన్నీ సంస్కృతంలో నుండి తెలుగులోనికి దిగుమతి ఐన మాటలే.
ఐతె, అరుదుగా కొన్ని తెలుగు మాటల్లో కూడా ఈ వర్ణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఠేవ అన్నది తెలుగు మాటే. సంస్కృతంలోంచి వచ్చింది కాదు.
ఈ విషయం మరికొంత వచ్చే టపాలో చర్చించటం జరుగుతుంది.
Thanks.
రిప్లయితొలగించండిchintaku
రిప్లయితొలగించండిchintaku sandhi wrong
రిప్లయితొలగించండి